కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న చంద్రబాబు

బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (22:33 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బూరుగుపూడిలో కారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. చంద్రబాబు కారును మరో వాహనం ఢీకొనడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ ప్రమాదంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం బంపర్‌కు నష్టం వాటిల్లింది
 
‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి రోడ్‌షో ప్రారంభించిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. 
 
అయితే యాత్ర ప్రారంభమైన వెంటనే ప్రమాదం జరగడం కలకలం రేపింది. అయితే మాజీ ఏపీ సీఎం చంద్రబాబు క్షేమంగా ఉన్నారని, తెలియరావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు