ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారి కలశస్థాపన, విశేష దీపారాధన చేశారు. కార్తీక మాసంలో నిర్వహించిన ఈ వేడుక భక్తలకు కనువిందు చేస్తున్నాయి.
హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీ యాగం) జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.