ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో రెండు కనుమదారుల్లో చెట్లు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. సాయంత్రం నుంచి వర్షం ఉద్ధృతి మరింత పెరగడంతో కనుమదారుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. రెండో కనుమదారిలో 14వ కిలోమీటరు వద్ద, దిగువ ఘాట్ రోడ్‌లో రెండో మలుపులో రహదారిపై బండరాళ్లు పడ్డాయి. జేసీబీల సాయంతో బండరాళ్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కనుమదారుల్లో మరింతగా కొండ చరియలు పడే అవకాశం ఉండటంతో రాత్రి 8గంటల నుంచి రేపు ఉదయం 6గంటల వరకు ఘాట్ రోడ్లను మూసివేయనున్నట్టు తితిదే అధికారులు తెలిపారు.