ఉగాది నుంచే కొత్త జిల్లాల నుంచి కార్యకలాపాలు: సీఎం జగన్

గురువారం, 10 ఫిబ్రవరి 2022 (23:13 IST)
ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి కార్యకలాపాలు కొనసాగించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కావాలన్నారు. కొత్త జిల్లాల్లో ఉద్యోగులు పని చేసేందుకు భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించి.. అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పారు. 
 
కొత్త భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. ఇప్పటి నుంచే చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా పనులు మొదలు పెట్టాలని చెప్పారు. ఇప్పటి నుంచే చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా పనులు మొదలు పెట్టాలని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు