వైఎస్‌ఆర్ పింఛను కానుకలో భాగంగా కులవృత్తులు, మెడికల్ విభాగాల అర్హుల్ని గుర్తించేందుకు కొత్త నిబంధనలు పొందుపర్చింది. పెన్షన్ పొందాలి అంటే తప్పనిసరి దరఖాస్తుదారులు వారి కులవృత్తినే జీవనాధారం అయి ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మెడికల్, ఒంటరి పెన్షన్ల విషయంలోనూ కఠినమైన రూల్స్ పాటించబోతోంది. అవసరమైన పత్రాలను ఎక్సైజ్, సాంఘిక సంక్షేమ శాఖ, చేనేత, జౌళిశాఖ, మత్స్యశాఖ, వైద్యశాఖలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
దరఖాస్తు ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, సచివాలయ సంక్షేమ కార్యదర్శులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఉన్నతాధికారులకు అందజేస్తారు. లబ్ధిదారుల వృత్తికి జియోట్యాగింగ్ చేసి వారి లాగిన్లు ద్వారా తిరిగి శాఖాధికారుల పరిశీలనకు పంపించాలి. అక్కడ అనుమతి లభించిన దరఖాస్తులకే ఎంపీడీవో, పురపాలిక అధికారులు మంజూరుకు సిఫార్సు చేస్తారు. దీన్ని 21 రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో 61.28 లక్షల మంది లబ్ధిదారుల ఉన్నారు.