కరోనా వైరస్ ఉన్నందున గుడివాడ డివిజన్ పరిధిలో గల ప్రజలందరు డిశంబరు, 31, జనవరి 1 తేదీల్లో నూతన సంవత్సర వేడుకును ఇంటివద్దనే జరుపుకోవాలని ఆర్డీవో శ్రీనుకుమార్ విజ్ఞప్తి చేసారు.
ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటం గాని కేకులు కట్ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. కొంత మంది మద్యం సేవించి రోడ్లపై తిరగుతూ ఇతరులను ఇబ్బంది పెట్టడం మనం చూస్తున్నామని, అటువంటి వాటికి తావు లేకుండా ఇంటి వద్దనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నారు.