స్థానిక జంగాల కాలనీకి చెందిన కళ్లెం సైదులు, భాగ్యమ్మ దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడ సంతానం ఉన్నారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం మరో ఆడశిశువుకు భాగ్యమ్మ జన్మనిచ్చింది. దీంతో, ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలున్నారు, నాల్గో ఆడపిల్లను పోషించలేమని భావించిన ఆ దంపతులు, పాములపాడుకు చెందిన వారికి రూ.10 వేలకు విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్నఐసీడీఎస్ అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం.