శృంగారంలో భార్యాభర్తలు, ఉన్నట్లుండి కరెంట్ షాక్

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (19:52 IST)
కొత్తగా పెళ్ళయిన జంట. హాయిగా జాలీగా తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రెస్టారెంట్లు, బంధువులతో హడావిడి, స్నేహితులతో కాలక్షేపాలు.. ఇక భార్యాభర్తల మధ్య పిచ్చాపాటీ. ఇదంతా తెలిసిందేగా.
 
అయితే ఆ నూతన వధూవరుల జీవితంలో కరెంట్ షాక్ తగలడం చివరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పాకాల మండలం భారతం మిట్ట నాలుగోవీధిలో నివాసముండే మహ్మమద్ రఫి, షాహిద్ బేగంలకు రెండునెలల క్రితమే వివాహమైంది. పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
 
బంధువులు కూడా వీరి జంటను చూసి అసూయపడేవారంటే వారు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చెప్పనవసరం లేదు. బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న రఫి వివాహం కోసం మూడునెలల పాటు సెలవులు పెట్టాడు. వివాహమైన తరువాత సొంత ప్రాంతం చిత్తూరు జిల్లాలోని పాకాలలో ఉన్నాడు.
 
వివాహ సెలవులు కావడంతో భార్యాభర్తలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బంధువుల ఇంటికి వెళ్ళడం.. వారి ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఇద్దరూ ఒంటరిగా ఏకాంతంగా ఉన్నారు. ఆ సమయంలో ఉన్నట్లుండి ఇంటి పైకప్పులో ఉన్న ఫ్యాన్‌కు ఉన్న కరెంట్ వైరు ఒక్కసారిగా వీరిపై తెగి పడింది.
 
భార్యాభర్తల మధ్య పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. దాంతో పాటు బెడ్ కాలిపోవడం.. ఇంట్లో ఫర్నిచర్ మొత్తం కాలిపోవడంతో వీరు గుర్తుపట్టలేని విధంగా తయారయ్యారట. నూతన వధూవరులు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు