ఆ సమయంలో మునిసిపల్ కమిషనర్ టి. కృష్ణవేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు మాజీ మంత్రిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయడంతోపాటు ఐపీసీ సెక్షన్ 354-(4), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 క్రింద కూడా కేసు నమోదు చేసినట్లు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
అలాగే, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ మరో కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. కాగా, అయ్యన్నను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.