సత్యదేవ్, ఆనంది కాంబినేషన్ లో వచ్చిన అరేబియా కడలి రివ్యూ

దేవీ

శనివారం, 9 ఆగస్టు 2025 (11:14 IST)
Satyadev, Anandi, Arabia Kadali
సత్యదేవ్, ఆనంది జంటగా నటించిన 'అరేబియా కడలి' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే తాను చేసిన కింగ్ డమ్ పాత్ర తర్వాత ఇలాంటిది రావడం కాస్త తనకే ఆశ్చర్యం కలిగించిందన్న సత్యదేవ్.. తండేల్ కూడా ఇంచుమించు అలాగే వుండేలా వుంటుందనే టాక్ కూడా వుంది. ఇంకా నాజర్, రవి వర్మ, పూనమ్ బజ్వా, వంశీ కృష్ణ, 'కోర్ట్' ఫేమ్ హర్ష్ రోషన్, చింతకింది శ్రీనివాసరావు తదితరులు నటించారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి షో రన్నర్‌గా వ్యవహరించిన సిరీస్‌లో కథ ను రచయిత చింతకింది శ్రీనివాసరావు, దర్శకుడు వీవీ సూర్యకుమార్ ఎలా చూపించారో తెలుసుకుందాం. 
 
కథ: 
విశాఖ భీమిలీపట్నంలోని సముద్ర తీర ప్రాంతం. మత్య్సవాడ, చేపలవాడ  రెండు గ్రామాల ప్రజల మధ్య గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా జెట్టీలు లేని కారణంగా చేపల వేటకు సరైన సదుపాయాలు లేవు. తిండి తిప్పల కోసం, అప్పులు తీర్చడానికి సంపాదన కోసం గుజరాత్ వలస వెళ్లి అక్కడ చేపల వేట వాళ్ళ వృత్తిగా చేసుకుంటారు. గుజరాత్ వలస వెళ్ళడానికి ముందు పొరుగూరి అబ్బాయి బదిరి (సత్యదేవ్)తో తన కుమార్తె గంగ (ఆనంది) ప్రేమలో ఉన్న విషయం నానాజీ (కోట జయరామ్)కు తెలుస్తుంది. 
 
అది తెలిసన తర్వాత గొడవ అవుతుంది. గుజరాత్ కు వెళ్లే టైంలో గొడవ పడటంతో పోలీసులు ట్రైన్‌లోనూ కిందకు దింపేస్తారు. అక్కడ నుంచి గుజరాత్ ఎలా వెళ్లారు? అక్కడ నుంచి పాకిస్తాన్ జలాల్లోకి ఎలా వెళ్లారు? వారు పాక్ ఆర్మీ చేతికి ఎలా చిక్కారు? వాళ్ళను ఇండియా తీసుకు రావడం కోసం ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? చివరకు ఏమైంది? అనేది మిగిలిన కథ.
 
సమీక్ష:
ఈ అరేబియా కడలి సిరీస్ చూస్తున్నంత సేపూ 'తండేల్' గుర్తుకు వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ వారికి జాలర్లు చిక్కడం వంటి సన్నివేశాలు స్పురిస్తాయి. కానీ సన్నివేశాలు వేరుగా వుంటాయి. చేపల వేటకు వెళ్లిన భారతీయ మత్యకారులు కొందరు పాక్ చేతికి చిక్కడం, అందులో ఒకరి ప్రేయసి తమ వాళ్ళను వెనక్కి తీసుకు రావడానికి ప్రయత్నించడం, ప్రభుత్వాన్ని కదిలించడం సిరీస్ కోర్ పాయింట్. ఈ కథకు షో రన్నర్ క్రిష్ జాగర్లమూడి తన మార్క్ జోడించారు.
 
సహజంగా రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని రెండు గ్రామాల మధ్య వైరాన్ని సమాంతరంగా స్పృశిస్తూ మానవత్వం గురించి చెప్పిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సహజత్వానికి దగ్గరగా తీయడం సీరిస్ ప్రత్యేకత. ప్రేమ  అలాగే దీన్నొక ప్రేమ కథగా తీయలేదు. ప్రేమించినోడు తనతో ఉంటే చాలని అమ్మాయి అనుకోలేదు. హీరో హీరోయిన్లకు ఒక పర్పస్ ఉంటుంది. ఈ సిరీస్ కు ఆర్ట్, కెమెరా వర్క్, మ్యూజిక్ కథకు బాగా సూటయ్యాయి.
 
జాలరిగా సత్యదేవ్ ఆహార్యం బాగుంది. విశాఖ నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఆ యాసను బాగా పట్టుకున్నారు. కథా నేపథ్యం ప్రేక్షకులకు చేరువ కావడంలో ఆ యాస కూడా హెల్ప్ అయ్యిందని చెప్పవచ్చు. గంగ పాత్రలో ఆనంది ఒదిగిపోయారు. వంశీ కృష్ణ, 'కోర్ట్' ఫేమ్ హర్ష్ రోషన్, చింతకింది శ్రీనివాసరావు పాత్రలు గుర్తుంటాయి. నాజర్, రవి వర్మ, పూనమ్ బజ్వా, 'కుబేర' ఫేమ్ దలీప్ తాహిల్ తమ పాత్రల పరిధి మేరకు చేశారు.
 
అయినా, కథ పరంగా కొత్తదనం ఆశిస్తే డిజప్పాయింట్ చేస్తుంది. 'తండేల్'కు మరో వెర్షన్ ఈ 'అరేబియా కడలి అనేంతటా వుండడమే ప్రధాన లోపంగా కనిపిస్తుంది. అయితే ఆ కథలో ప్రేమను కాకుండా మానవత్వాన్ని హైలైట్ చేస్తూ తీశారు. అందువల్ల, సిరీస్ చూడాలని అనుకుంటే ఎటువంటి అంచనాలు పెట్టుకోవద్దు. నటుడిగా సత్యదేవ్ బెస్ట్ ఇచ్చారు. ఈ సిరీస్ ను మరింత కొత్తదనంగా చూపిస్తే చాలా మైలేజ్ వుండేది. ఏది ఏమైనా ఓటీటీలో హాయిగా చూడతగ్గ సినిమాగా చెప్పుకోవచ్చు.
రేటింగ్ :2.75/ 5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు