బ్రదర్ అనిల్‌కు నాన్ ‌బెయిలబుల్ వారెంట్

ఆదివారం, 18 ఆగస్టు 2019 (10:53 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌ మోహన్ రెడ్డి బావ, బ్రదర్ అనిల్‌ కుమార్‌పై నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ జారీ అయ్యింది. 2009 మార్చి 28వ తేదీన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఖమ్మం కరుణగిరి ప్రాంతంలో ఓ పార్టీకి ఓటువేయాలంటూ కరపత్రాలు పంచారని ఆయనపై అప్పట్లో కేసు నమోదైంది. 
 
ఆ కేసులో ఏ1గా ఉన్న అనిల్‌ కుమార్‌ కోర్టుకు హాజరుకాకపోవడంతో సోమవారం ఆయన్ను కోర్టులో హాజరుపరచాలని ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు జడ్జి ఎం.జయమ్మ శుక్రవారం వారంట్‌ జారీ చేశారు. అయితే, ఆయన కోర్టులో లొంగిపోతారా లేకా పైకోర్టుకు వెళతారా అన్నది తేలాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు