హత్యలు, హత్యాచారాల ఘటనలపై రాష్ట్ర సర్కారు, పోలీసు యంత్రాంగం అగ్రకులాల విషయంలో ఒక రకంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి మరోరకంగా వ్యవరిస్తోందని మందకృష్ణ ఆరోపించారు. దీనిపై పోరాటం చేస్తామని వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలు, మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.
దీన్ని నిరసిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 8న 'ఛలో కొంగరకలాన్-ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాల యుద్ధభేరి' పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాములు నాయక్, మాల మహానాడు జాతీయాధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సభ విజయవంతం కోసం... ఈ నెల 16నుంచి సన్నాహక యుద్ధభేరి భేరి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా... మార్చ్ 5 వరకు నిర్వహిస్తామని తెలిపారు.