వైవిధ్యమైన కథలు, పాత్రలతోనే కాదు, తనదైన నటనతోనూ యువతను అలరిస్తున్న నటుడు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు మరో గుర్తింపును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. 2025 దక్షిణాది నటుల్లో హాటెస్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నారు. యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 వేడుక తాజాగా జరిగింది. పలువురు సినీతారలు ఇందులో పాల్గొని సందడి చేశారు.
ఇకపోతే, దక్షిణాది వినోద రంగంలో గ్లామర్, స్టైలిష్ పర్సనాలిటీస్‌కు తొలిసారిగా ఈ అవార్డులను ప్రకటించారు. మోస్ట్ గ్లామరస్ యూత్ ఐకాన్ అవార్డును రాశీఖన్నా అందుకుంది. తరాలు మారినా తరగని అందం, స్టైల్‌తో యువత కథానాయకులు పోటీగా నిలిచిన అగ్ర కథానాయకుడు చిరంజీవి స్టైల్ ఐకాన్ డౌన్ ది ఇయర్స్ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే స్టార్ ఫర్ ఆల్ సీజన్స్ అవార్డు వెంకటేశ్‌కు దక్కింది. మోస్ట్ స్టైలిష్ ఐకాన్ అండ్ స్టార్‌గా అల్లు అర్జున్ నిలిచారు.