టీడీపీ నేత పీఆర్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని వాదించారు. కలెక్టర్, డీఎంహెచ్ఓ ఆక్సిజన్ సమయానికి అందలేదని చెప్పారని... ఇది నిర్లక్ష్యమేనని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
వాదనలు విన్న కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తిరుపతి ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం కోర్టు ప్రారంభమైన తొలిరోజుకి విచారణ జరుగనుంది. కాగా, ఈ ఘటనలో మృతుల లెక్కపై ఇప్పటికీ స్పష్టమైన క్లారిటీ లేని విషయం తెల్సిందే.