కాగా, పలు అవినీతి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన సీఎం జగన్.. ప్రస్తుతం షరతుల బెయిల్‌పై ఉన్న విషయం తెల్సిందే. అయితే, ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, అందువల్ల జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ వైకాపాకే చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నెల 7వ తేదీన దీన్ని కోర్టు విచారణకు స్వీకరించింది. ఆ సమయంలో కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలంటూ కోరడంతో ఈ నెల 17వ తేదీకి వాయిదావేసింది. ఆ ప్రకారంగా సోమవారం విచారణకు రాగా, మళ్లీ సమయం కావాలంటూ సీబీఐ తరపు న్యాయవాది కోరడంతో ఆగ్రహించిన న్యాయమూర్తి.. ఇదే చివరి అవకాశం అంటూ హెచ్చరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.