ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్‌లో అపశృతి.. ఒకరు మృతి

ఠాగూర్

బుధవారం, 6 మార్చి 2024 (07:54 IST)
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహన్ ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో జరిగింది. మంత్రి సురేశ్ ప్రకాశం జిల్లా నుంచి విజయవాడ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశినేని పల్లి వద్ద జాతీయ రహదారిలో ఎస్కార్ట్ వాహనం అటుగా వెళుతున్న ఒక ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మృతుడిని త్రిపురాంతకం మండలం మనరాజుపాళెంకు చెందిన ఇజ్రాయేల్‌గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్‌లో ముందు వాహనంలో ఉన్నారు. దీంతో ఆయన ఎలాంటి ప్రమదం జరగలేదు.
 
అప్పులు చేయడంలో పీహెచ్‌డీ చేసిన వైఎస్ జగన్... జర జాగ్రత్తంటూ ప్రజలకు వినతి 
 
అప్పులు చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పీహెచ్‌డీ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీలన్నీ లాభాలతో కళకళలాడుతుంటే రాష్ట్ర ఖజానా మాత్రం దివాళా తీసిందని ఆయన ఆరోపించారు. 
 
ఇదే విషయంపై నారా లోకేశ్, మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే... అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారని ఆరోపించారు. 
 
ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని ముఖ్యమంత్రి... అప్పులు తేవడంలో మాత్రం పిహెచ్ డి చేశారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్... తాజాగా రాష్ట్రంలో ఖనిజసంపదను తాకట్టుపెట్టి రూ.7వేల కోట్లు అప్పు తెచ్చారని మండిపడ్డారు. 
 
ఇప్పటికే మందుబాబులను తాకట్టుపెట్టి రూ.33వేల కోట్లు అప్పు తెచ్చిన జగన్ జమానాలో ఇక మిగిలింది రూ.5 కోట్ల మంది జనం మాత్రమే. ఇప్పటికే నేను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదర గొడుతున్న జగన్మోహన్ రెడ్డి మాటల వెనుక అంతర్యాన్ని గుర్తించి రాబోయే రెండు నెలలపాటు ఆయనతో జాగ్రత్తగా ఉండాల్సిందిగా రాష్ట్రప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు