ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటిప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 12,829 క్యూసెక్కుల నీరు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,130, సుంకేసుల నుంచి 2,215 క్యూసెక్కుల నీటితో కలిపి మొత్తం 48,174 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది.
జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 843.70 అడుగులుగా ఉంది. ఎపి జల విద్యుతుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించలేదు. తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి 28,252 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.