గత కొన్ని రోజులుగా భయభ్రాంతులకు గురిచేస్తూ వచ్చిన ఎలుగుబంటిని శ్రీకాకుళం అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ ఎలుగుబంటు గత కొన్ని రోజులుగా సంచరిస్తూ హల్చల్ చేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. దీన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు శతవిధాలా ప్రయత్నించారు. ఇన్ని రోజులు చిక్కకుండా తప్పించుకుని తిరగసాగింది.
కాగా, ఆదివారం కిడిసింగి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడిపై ఎలుగు దాడి చేయడంతో అతను ప్రాణాలు విడిచాడు. అలాగే, వజ్రపుకొత్తూరు సంతోషిమాత ఆలయంలోని జీడితోటలో పశువుల కోసం రేకుల షెడ్డు వేస్తుండగా ఎలుగుబంటి ఏడుగురిపై దాడి చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు మృతిచెందగా.. ఆరుగురు శ్రీకాకుళంలోని మెడికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.