సచివాలయంలోని విద్యాశాఖ మంత్రి సురేష్ చాంబర్లో ఉపాధ్యాయ సంఘాలు సమావేశం అయ్యాయి. బదిలీ ఉత్తర్వులలో అవసరమైన మార్పులు చేయాలని గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని కాబట్టి ఈనెల 21వ తేదీన అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారుల కార్యాలయాల వద్ద పికెటింగ్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నోటీస్ అందజేసింది.