విజయవాడ నగర అభివృద్ధిలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న 40 పార్కులలో ఒక దానికి ప్రముఖ సంపాదకులు, కీర్తిశేషులు చక్రవర్తుల రాఘవాచారి పేరు పెట్టడానికి విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సుముఖత వ్యక్తం చేశారు.
నగరంలో పారిశుద్ధ్య మెరుగుదలకు కార్పొరేషన్ చేపట్టిన కార్యక్రమాలను సవివరంగా వివరించారు. కృష్ణా అర్బన్ యూనిట్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగిన మీడియా డైరీ ఆవిష్కరణ సభలో ఐ జే యు జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ డైరీని సకాలంలో తీసుకు రావడానికి సహాయ సహకారాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సభలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ.సుబ్బారావు, చందు జనార్థన్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మ రాజు చలపతిరావు, ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు ఎస్ కె బాబు మాట్లాడుతూ డైరీ ప్రాధాన్యతను వివరించారు.