డెబిట్‌/ క్రెడిట్‌కార్డులను స్విచాఫ్‌ చేయొచ్చు

శుక్రవారం, 17 జనవరి 2020 (07:45 IST)
డెబిట్‌‌, క్రెడిట్‌‌కార్డుల లావాదేవీలకు మరింత భద్రత కల్పించడం, వీటి వాడకాన్ని మరింత సులభంగా మార్చడానికి ఆర్‌‌బీఐ కొన్ని గైడ్‌‌లైన్స్ విడుదల చేసింది.

ఇక నుంచి ఇచ్చే డెబిట్‌‌/క్రెడిట్‌‌/ఏటీఎం కార్డులు డొమెస్టిక్‌‌ ఏటీఎంలలో, పీఓఎస్‌‌ టెర్మినళ్లలో మాత్రమే పనిచేసేలా పరిమితం చేయాలని సూచించింది.

వీటిని విదేశాల్లో, ఆన్‌‌లైన్‌‌లో వాడాలన్నా, కాంటాక్ట్‌‌లెస్‌‌ పేమెంట్‌‌ సదుపాయం కావాలన్నా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. కొత్తగా ఇస్తున్న కార్డులకు కొత్త రూల్స్‌‌ ఈ ఏడాది మార్చి నుంచి అమలవుతాయి.

ప్రస్తుత కార్డులకు ఏయే పర్మిషన్లు ఇవ్వాలనే విషయమై బ్యాంకులు/ఆర్థిక సంస్థలే నిర్ణయం తీసుకుంటాయి. రిస్క్‌‌ తీసుకోగలిగే సామర్థ్యాన్ని బట్టి పర్మిషన్లు ఇస్తాయి. ఇప్పటి వరకు ఎన్నడూ ఆన్‌‌లైన్‌‌లో, విదేశాల్లో వాడని, కాంటాక్ట్‌‌లెస్‌‌ ట్రాన్సాక్షన్లు జరపని కార్డులకు పైన పేర్కొన్న సదుపాయాలకు వర్తించకుండా డిజబుల్‌‌ చేయాలని ఆర్‌‌బీఐ స్పష్టం చేసింది.

అయితే యూజర్లు ఈ ఫీచర్లను ఎప్పుడూ కావాలంటే అప్పుడు స్విచాఫ్‌‌ చేయొచ్చు స్విచాన్‌‌ చేయొచ్చు. అంటే, కావాలనుకున్నప్పుడు మొబైల్‌‌ యాప్‌‌/ఏటీఎం/ఆన్‌‌లైన్‌‌ ట్రాన్సాక్షన్స్‌‌/కాంటాక్ట్‌‌లెస్‌‌ ట్రాన్సాక్షన్‌‌ వంటి ఫీచర్లను యాక్టివేట్‌‌ చేసి, అవసరం లేనప్పుడు డిజబుల్‌‌ చేయవచ్చు.

ప్రీపెయిడ్‌‌ గిఫ్ట్‌‌కార్డులకు, ప్రజారవాణా వాహనాల్లో వాడే కార్డులకు ఈ రూల్స్‌‌ వర్తించవు. సైబర్‌‌ నేరాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని బ్యాంకులు ఏటీఎం విత్‌‌డ్రాయల్స్‌‌కు ఓటీపీ ఎంటర్‌‌ చేసే ఫీచర్‌‌ను కూడా అందజేస్తున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు