కొడాలి నానీ పనికి మాలిన వ్యక్తి: పట్టాభిరామ్

శనివారం, 12 డిశెంబరు 2020 (06:56 IST)
కొడాలి నానీ అనేపనికిమాలిన వ్యక్తి ఏరోజైనా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిత్వశాఖకు సంబంధించి ఒక్కసమీక్ష కూడా నిర్వహించిన దాఖాలాలులేవని, పొద్దున్నలేస్తే అసభ్యకర పదజాలంతో నోరేసుకొని పడిపోవడం తప్ప మరోపనిచేయడని  టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ...!
 
కొడాలినాని తన మంత్రిత్వశాఖకు సంబంధించి ఏంచేస్తున్నాడని ప్రజల తరుపున అడుగుతున్నా. 18నెలల్లో రూ.16వేలకోట్ల అప్పులఊబిలో తనశాఖను ముంచాడు. పెద్ద సెటిల్ మెంట్ ముఠాను అడ్డుపెట్టుకొని ఇష్టానుసారం అవినీతికి పాల్పడుతున్నాడు.  పట్టాభి అంటే ఎవరో తెలియదన్న నానీకి, నేటినుంచి నేనెవరో గుర్తుంచుకునేలా ప్రజలతరుపున ఆయన్ని నిలదీస్తూనే ఉంటాను. 

ఆయనలా బూతులుమాట్లాడటం నాకు తెలీదు. నానీ ఎంత అధ్వాన్నంగా తనశాఖను నడుపుతున్నాడో ప్రజలకు తెలిసేలా చెబుతా. నానీ పడుకున్నా కూడా కలలోవచ్చేలా ఆయన్ని నిలదీస్తూనేఉంటాను. పొద్దున్నలేస్తే పట్టాభికి ఏం సమాధానం చెప్పాలిరా నాయనా అని నిత్యం తలుచుకునేలా చేస్తాను. 

17లక్షలరేషన్ కార్డుల తొలగింపునకు శ్రీకారం చుట్టిన నానీ, ఈ నెలలోనే 8లక్షల43వేల కార్డులను తొలగించాడు. అటువంటి వ్యక్తి చంద్రబాబునాయుడిని అంటాడా? నోట్లో జరదా వేసుకొని, చొక్కాకు గుండీలుకూడా పెట్టుకోకుండా, రౌడీలా ఉంటూ ఏదిపడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా? తాను అడిగే ప్రశ్నలకు నానీ, అతని ముఖ్యమంత్రి  సమాధానం చెప్పాలి.

గతంలో చంద్రబాబునాయుడిపాలనలో  రేషన్ దుకాణాల్లో ఏమేమి సరుకులు ఇచ్చారో నానీకి తెలుసా?  చంద్రబాబునాయుడి హాయాంలో ఒక్కరేషన్ కార్డు కూడా తొలగించలేదని ఈ నానీకి తెలుసా? ఒక్క కార్డు కూడా తొలగించకుండా, బియ్యంతో పాటు  పంచదార అరకేజీ పదిరూపాయలకు అందించారు. కందిపప్పు కేజీ రూ.40చొప్పున అందించారు.

రాగులు కేజీ రూపాయి, జొన్నలు కేజీ రూపాయి, గోధుమపిండి కేజీ రూ16కు, అయోడైజ్డ్ ఉప్పుతో పాటు ఆఖరికి పేదమహిళలకు శానిటరీ ప్యాడ్స్ ను కూడా అందించడం జరిగింది. దాదాపు 8 నుంచి 10రకాల సరుకులను 50శాతంసబ్సిడీపై పేదలకు అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వా నిదని నానీ తెలుసుకుంటే మంచిది. 

వాటితో పాటు పేదలు పండుగలను  సంతోషంగా జరుపుకోవాలన్న సదుద్దేశంతో చంద్రబాబునాయుడు క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫాలపేరుతో పండుగ సరకులు అందించారు.  నానీ ఏంచేస్తున్నాడో ఆయనకైనా తెలుసా.

సన్నబియ్యం ఇస్తానని చెప్పి మోసగించాడు. పంచదార ధరను  రూ.14పెంచి, కేజీ రూ.34కు అందిస్తున్నారు. ఇది వాస్తవమో కాదో నానీ చెప్పాలి. రూ.14ల ధర పెంచడంవల్ల, ఈ ప్రభుత్వం సంవత్సరానికి రూ.117కోట్ల భారాన్ని రాష్ట్రప్రజలపై మోపింది. రూ.40గా ఉన్న కందిపప్పు ధరను రూ.67కు పెంచింది నానీకాదా?

కందిపప్పు ధర పెంచడద్వారా ఏడాదికి రూ.467కోట్ల భారంప్రజలపై వేశాడు. బూతులశాఖామంత్రి, ముఖ్యమంత్రికలిసి పంచదార, కందిపప్పుపై ఏడాదికి రూ.584కోట్ల వరకు జనంజేబులనుంచి నిర్దాక్షణ్యంగా వసూలుచేస్తున్నారు. అంతటితోఆగకుండా దాదాపు 9లక్షల రేషన్ కార్డులను తొలగించిన నానీ, బియ్యం రూపంలో చూస్తే ప్రజలకు ఖర్చుచేయాల్సిన సొమ్ము రూ.540కోట్లను ఎగ్గొడుతున్నారు.

అంటే దాదాపు నెలకు రూ.45కోట్ల వరకు ప్రజలకు దక్కాల్సిన సొమ్ముని కాజేస్తున్నారు. బియ్యం, పంచదార, కందిపప్పులను కలిపి చూస్తే,  ఎగ్గొట్టడంగానీ, ధరలపెంచడం ద్వారాగానీ రూ.1120కోట్ల వరకు నానీ, జగన్ లే మింగేస్తున్నారు. 

పేదలకు తిండిపెట్టే రేషన్ దుకాణాలను కూడా వదలకుండా, వాటిని అడ్డుపెట్టుకొని కూడా ముఖ్యమంత్రి దోపిడీకి పాల్పడుతు న్నారు.  నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ వెబ్ సైట్ ను ఒక్కసారి పరిశీలిస్తే, ప్రజలకు మరిన్ని వాస్తవాలు తెలుస్తాయి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేంద్రప్రభుత్వం గుర్తించిన రేషన్ కార్డులు, ఏపీలో 88లక్షల16వేల875 వరకు ఉన్నాయి.

రాష్ట్రంలో నవంబర్  నెలవరకు ఉన్న రేషన్ కార్డులు కోటి 52లక్షలు.  డిసెంబర్ నాటికి కార్డులసంఖ్యను కోటి44లక్షలకు తగ్గించారు. ఒక్క నెలలోనే జగన్ ప్రభుత్వం 8.50లక్షల కార్డులను అన్యాయంగా తొలగించింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని  ప్రజలు తెలుసుకుంటే మంచిది. 

జగనన్న లక్ష్యం వేరేఉందని కూడా ప్రజలు గ్రహించాలి. అదేంటంటే రేషన్ కార్డులను పూర్తిగా 88లక్షలకు పరిమితం చేయడం, అంటే కేంద్రం గుర్తించినకార్డుల సంఖ్య ఏదైతేఉందో, ఆ సంఖ్యకే రాష్ట్రంలోనికార్డులను పరిమితం చేయబోతున్నారు దిక్కుమాలిన మంత్రి కొడాలినాని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంటే దాదాపుగా 60లక్షల కార్డులకు కోతపెట్టబోతున్నాడు ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి.

కేంద్రం గుర్తించిన రేషన్ కార్డులకు కేంద్రమే బియ్యం ఉచితంగా సరఫరా చేస్తుంది. రాష్ట్రఖజానాపై రూపాయికూడా భారం పడదు. రాష్ట్రం భరించాల్సిన భారాన్నిదించుకునేందుకే  ముఖ్యమంత్రి 60లక్షలకార్డులను తొలగించడానికి సిద్ధమయ్యాడని ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలతో పని అయిపోయింది కాబట్టి, ఇక తాను ఏంచేసినా వారేమీ చేయలేరు, ప్రజలుఎలాపోతో నాకేంటి అనే  అహంకారధోరణితోనే జగన్మోహన్ రెడ్డి రేషన్ కార్డులపై పడ్డా డు.

151 సీట్లు గెలిచిన ముఖ్యమంత్రికదా, ఆయన పనులు అలానే ఉంటాయి. 60లక్షల రేషన్ కార్డులను తొలగిస్తే, ఒక్క బియ్యం రూపంలోనే జగన్ కు మిగిలే సొమ్ముసంవత్సరానికి రూ.3,700కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ని అప్పులఊబిలోకి దించిన బూతులమంత్రి, ముఖ్యమంత్రి, పేదలకు గుప్పెడు బియ్యం కూడాలేకుండా చేయడానికి సిద్ధమయ్యారు.  

18నెలల్లోనే రూ.లక్షా40వేలకోట్ల అప్పులుచేసినా కూడా, ఇంకా ముఖ్యమంత్రి ధనదాహం తీరలేదు.  అందుకని కేంద్రప్రభుత్వం కల్పించిన వెసులుబాటుని ఉపయోగించుకొని, మరిన్ని అప్పులు పొందడానికి  సిద్ధమయ్యాడు. ఎఫ్ఆర్ బీఎం పరిమితి 2శాతం పెంచుకోవడానికి పవర్ సెక్టార్ రిఫార్మ్స్, అర్బన్  లోకల్ బాడీ రిఫార్మ్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అనే నాలుగుషరతులను అమలుచేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు.

దానివల్ల ఆయనకు మరో రూ.20వేలకోట్ల అప్పులు లభించే అవకాశం ఉంది. దానిలో భాగంగానే కార్డుల తొలగింపునకు శ్రీకారం చుట్టాడు. పవర్ సెక్టార్ కి సంబంధించి సంస్కరణల ముసుగులో రైతులమోటార్లకు మీటర్లు బిగించడానికి సిధ్దమయ్యాడు.

రాష్ట్ర ప్రభుత్వం 20-08-2020న కేంద్రానికి రాసిన లేఖలో రూ.20,203కోట్ల అప్పులు తెచ్చుకోవడానికి  ఆస్కారం ఉందని చెప్పడం జరిగింది. రైతులకు మోటార్లకు మీటర్లు బిగించడం, ఆస్తిపన్ను పెంచడం, రేషన్ కార్డులు తీసేయడం వంటి వాటిని చేస్తున్నాం కాబట్టి, ఏపీ ప్రభుత్వానికి రూ.20వేలకోట్ల రుణం తీసుకునేందుకు అవకాశంఇవ్వాలని ఆలేఖలో కోరారు. 

పేదలంటే లెక్కలేదు కాబట్టే, కేంద్రం విధించినషరతులను అంగీకరించి లక్షలకార్డులను తొలగించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు. తొలగించిన కార్డులు అలాఉంటే, ఉన్నకార్డులకు ఇచ్చే సరుకులు కూడా నాసిరకమైనవే ఇస్తున్నారు. కందిపప్పు, బియ్యం, పంచదార పై ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పత్రికల్లో వాటికి సంబంధించిన కథనాలుకూడా వచ్చాయి.

ముక్కిపోయిన బియ్యం, పుచ్చిపోయిన కందిపప్పు, మట్టిగడ్డ లున్న శనగలను ప్రజలకు పంచారు.  టీడీపీ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డుకూడా తొలగించకుండా, 8 నుంచి 10రకాల సరుకులను అందిస్తే, కొడాలినానీ ముఖ్యమంత్రి జగన్ కలిసి 60లక్షల కార్డుల తొలగింపునకు సిద్ధమయ్యారు. రేషన్ కార్డులు తొలగిస్తే, సంక్షేమ  పథకాల్లో కూడా కోతతప్పదు.

ప్రతి ఒక్కసంక్షేమపథకానికి తెల్లరేషన్ కార్డుకి ముడిపెట్టారు. కార్డులు పోతే పింఛన్లు, ఇళ్లస్థలాలు, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక వంటి పథకాల్లో కూడా ప్రజలకునష్టం తప్పదు. జగన్మోహన్ రెడ్డి స్థానికసంస్థల ఎన్నికలను దృష్టిలో పెంచుకొనే, కార్డుల తొలగింపును ప్రస్తుతానికి 8.50లక్షలతో సరిపెట్టాడు. ఆ ఎన్నికలు పూర్తయితే, 60లక్షల కార్డులు గోవిందా. రేషన్ వస్తువులు సరఫరాకు ఉపయోగించే గోనెసంచుల్లో కూడా ప్రభుత్వం కక్కుర్తిపడింది.

గోనెసంచులను తొలగించి పాలిమర్ సంచుల్లో కందిపప్పుని సరఫరా చేస్తున్నారు. గాలి తగలకపోతే కందిపప్పు పాడయ్యే అవకాశంఉంది. అప్పుల కోసంకేంద్రానికి రాసిన లేఖపై, సంవత్సరంన్నరలోనే  సివిల్ సప్లయిస్ డిపార్ట్ మెంట్ ను రూ.16వేలకోట్ల అప్పులఊబిలోకి నెట్టిన వైనంపైప్రభుత్వం, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. 

ప్రజలంతా ఇప్పటికైనా చంద్రబాబునాయుడి పాలనను, జగన్ చేస్తున్న మోసాలను గుర్తించాలని కోరుతున్నా. కొడాలినానీకి నిత్యం గుర్తొచ్చేలా, ఆయనశాఖకు సంబంధించిన వాస్తవాలనుప్రజలకు వివరిస్తూనే ఉంటాను. ఒక్కరేషన్ కార్డు తొలగించినాకూడా టీడీపీ చూస్తూఊరుకోదని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు