ఎవరు అండగా నిలబడినా నిలబడకున్నా నా పని నేను చూసుకుంటూ వెళ్లిపోతా. సలహాలు ఇస్తూ మాత్రం కూర్చోను. నేను ఎవర్నీ నమ్మించడానికి ప్రయత్నం చేయను. తన గ్రామానికి బాట కోసం ఒంటరిగా కొండని పగులగొట్టిన మాంజీ లాంటి వాడిని నేను. పేరు, డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు. అందుకే ఎవరి గురించి మాట్లాడేందుకయినా నేను భయపడను.
టీజీ వెంకటేష్ నాకు వ్యక్తిగతంగా పరిచయస్తులే. అయితే తప్పు చేస్తే మాత్రం ఎవర్నీ వదిలిపెట్టను. తుంగభద్ర జలాలని ఆయన పాడుచేస్తుంటే మాట్లాడతా. మీ బిడ్డలకి వేల కోట్లు సంపాదించి ఇచ్చినా తాగేందుకు మంచినీరు ఇవ్వలేరన్న విషయాన్ని వారికి వివరిస్తా. ముఠా కక్షలు, ఫ్యాక్షనిజం మీద చాలా కోపం ఉంది.
వేల కోట్లు, కిరాయి మూకలు ఉన్నా, ప్రయివేటు సైన్యం ఉన్నా అన్నింటికీ తెగించి వచ్చా.. ఎవరి జీవితాలు రిస్క్‌లో పెట్టను.. నేనొక్కడినే పోరాడుతా.. మిమ్మల్ని రచ్చబండలకి తీసుకెళ్లను. మేం పని చేస్తాం మీరు చదువుకునే పరిస్థితులు కల్పిస్తాం. డబ్బు సంపాదించుకునే పరిస్థితులు కల్పిస్తాం. డబ్బు కట్టనవసరం లేని వ్యవస్థ తెస్తాం.. జ్ఞానం, మేధస్సు ఉన్న వారిని ప్రభుత్వం ముందుకి తీసుకువెళ్లాలి. ప్రభుత్వం చదువుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.