ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయపార్టీల నేతలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రత్యర్థులను ఎలాగైనా ఓడించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎపిలో మూడవ పార్టీగా కొనసాగుతున్న జనసేన పార్టీని ఏ విధంగానైనా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు వైసిపి నేతలు. కర్నూలు జిల్లాలో ప్రచారం చేస్తున్న పవన్‌కు పోటీగా ఆయన మాజీ భార్య రేణుదేశాయ్‌ను రంగంలోకి దించారు.