పవన్ బర్త్ డే.. అపశృతి.. అభిమాని మృతి!

మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (10:57 IST)
పవన్ కల్యాణ్ బర్త్ డే రోజున అపశృతి చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో పవన్ కల్యాణ్ అభిమాని అయిన ఓ యువకుడు మంగళవారం మృతి చెందాడు. చీరాల-ఒంగోలుకు మధ్య ఉన్న తీరప్రాంత గ్రామం చిన్నగంజాం గ్రామంలో ఉండే రమేష్, అతని స్నేహితులు పవన్ కల్యాణ్‌కు వీరాభిమానులు. 
 
మంగళవారం పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలోని మెయిన్ రోడ్డు మీద ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి రమేష్ దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో అతనితో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

వెబ్దునియా పై చదవండి