రౌడీలుగా మాదిరిగా మేము గొడవులు పెట్టుకోం. బాధ్యతగల ఎమ్మెల్యే ఎలా ఉంటారో మీకు చూపించబోతున్నామని జనసేన పార్టీ అధినేత, భీమవరం అసెంబ్లీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, తనకు భీమవరంతో చిన్నప్పటి నుంచి ఎంతో అనుబంధం ఉందన్నారు. అందుకే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నట్టు తెలిపారు.
అర్బన్ బ్యాంక్ దోపిడితో పది వేల కుటుంబాల భవిష్యత్, వారి ఆశలను గ్రంధి శ్రీను అనుచరులు దెబ్బతీశారని విమర్శించారు. పదివేల కుటుంబాల కష్టార్జితం దోచేస్తే వారి ఉసురుతగలదా మీకు గ్రంధి శ్రీనుగారు... అంటూ సూటిగా ప్రశ్నించారు.
భీమవరం ప్రభుత్వాసుపత్రిని అత్యాధునిక ఆస్పత్రిగా మార్చుతానని చెప్పారు. భీమవరానికి ఎంతో మంది ఎమ్మెల్యేలు పనిచేసినా యనమదుర్రు డ్రైయిన్ కంపు పోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక పట్టణంలో ఓవర్‌బ్రిడ్డి, బైపాస్ రోడ్డు సమస్యలపై దృష్టి సారిస్తానన్నారు.