వైకాపా నేతల కాళ్లు చేతులు విరగ్గొట్టడం ఖాయం : పవన్ కళ్యాణ్

ఆదివారం, 13 నవంబరు 2022 (17:47 IST)
ఏపీలోని వైకాపా నేతలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకుంటే మాత్రం కాళ్లు చేతులు విరగ్గొట్టడం ఖాయమని హెచ్చరించారు. 
 
ఆయన ఆదివారం విజయనగరం జిల్లా గుంలాలంలో ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, జనసేన అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చూపిస్తామన్నారు. ప్రజల కోసమే జనసేన పార్టీ ఏర్పాటు చేశామన్నారు. చంపుతానని, బెదిరిస్తున్నారని అయినా తను వెనుకంజ వేయబోనని చెప్పారు. 
 
జనసేన పార్టీకి ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో మార్పు అంటే ఏంటో చూపిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కోరారు. మెరుగైన భవిష్యత్ కోసం జనసేనపై నమ్మకం ఉంచాలని, మార్పు అంటే ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. 
 
తనపై నమ్మకం ఉంచితే గూండాలతో అయినా పోరాడుతానని పవన్ ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర జనసైనికులు కేసులకు భయపడొద్దని, కేసులో పెడితే తాను కూడా వస్తానని హామీ ఇచ్చారు. రాజధాని పేరిట వైకాపా ప్రభుత్వం చేస్తున్న వంచనను ఉత్తరాంధ్ర ప్రజలు ఇకనైనా తెలుసుకోవాలని, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి బలమైన రాజకీయం దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
అవినీతిపై రాజకీయ పోరాటం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. యువతీయువకులు తమ శక్తిని అవినీతి రహిత సమాజంగా ఏర్పాటుకోసం ఉపయోగించాలని అన్నారు. అంతకుముందు ఆయన జగనన్న కాలనీ రాష్ట్రంలోన అతి పెద్ద కాలనీ. 397 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాుర. అయితే, ఇక్కడ ఇళ్ల నిర్మాణం సరిగా సాగడం లేదని జనసేన ఆరోపిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు