కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది... పవన్ కళ్యాణ్

ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (17:13 IST)
కర్మ సిద్ధాతం అనేది ఒకటి ఉంటుందని చేసిన దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలోని పోలీసులు వైకాపా కార్యకర్తల తరహాలో, ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఇటీవల విజయవాడ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడ పాల్గొని మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేశారు. అంతేకాకుండా, అధికారులకు కూడా ఆయన హితవు పలికారు. పోలీసు శాఖలో కొందరు ప్రేవైటు సైన్యంలా మారిపోయారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలను కారులోనే ఉండాలని, కారులోంచి దిగొద్దని ఆదేశిస్తున్నారంటూ విశాఖలో పవన్ కళ్యాణ్‌ను ఓ పోలీస్ అధికారి బెదిరించిన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. 
 
దీనిపై పవన్ కళ్యాణ్ ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. జస్టిస్ గోపాలగౌడ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. ఏపీలో సాగుతున్న వైకాపా అరాచక పాలనపై జస్టిస్ గోపాల్ గౌడ చేసిన వ్యాఖ్యలను అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని, ఏపీలో అధికారులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న తీరును అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు స్పష్టంగా గమనిస్తున్నారని పవన్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు