ప్రజల వద్దకు వెళ్లకుండా ఉండేందుకే చీకటి జీవో : పవన్ కళ్యాణ్

ఆదివారం, 8 జనవరి 2023 (15:10 IST)
వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైకాపా నేతలకు పట్టుకుందని, అందుకే విపక్ష పార్టీల నేతలు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకునేందుకు చీకటి జీవో నంబరు 1ని తీసుకొచ్చారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆయన ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును హైదరాబాద్ నగరంలో ఆయన నివాసంలో కలుసుకున్నారు. వీర్దదరూ సుధీర్ఘంగా సమావేశమయ్యారు. 
 
ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. పెన్షన్లు తొలగింపు, ఫీజు రీయింబర్స్‌మెంట్, శాంతిభద్రతలు లోపించడం, రైతులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, ఇసుక అక్రమ రవాణా, డ్రగ్స్ మాఫియా వంటి అంశాలపై చర్చించినట్టు తెలిపారు. 
 
పైగా, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపకుండా ఉండేందుకు, విపక్ష నేతలు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకునేందుకు వీలుగా జీవో నంబర్ 1 ను తీసుకొచ్చారని ఆరోపించారు. ఇలాంటి చెత్త జీవోలను తీసుకురావడాన్ని ఆపాలని బలంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. 
 
ఈ జీవో తీసుకుని రావడానికి ముందే తనను వైజాగ్‌లో అడ్డుకున్నారని, వాహంలో నుంచి దిగకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు.. గదిలోనుంచి బయటకు రాకూడదు ఇలా అనేక ఆంక్షలు విధించారని పవన్ మండిపడ్డారు. ఇపుడు జీవో నంబర్ 1 ను తీసుకొచ్చి, పోలీసుల అండతో చంద్రబాబును అడ్డుకున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు