ఇటీవల ఏపీ సర్కారు ఇంగ్లీషు మీడియంపై నిర్ణయం తీసుకున్నప్పుడు జనసేన తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే జనసేన ఇంగ్లీష్ మీడియం బోధనకు ఏమాత్రం వ్యతిరేకం కాదని ఏపీలో ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేసినప్పుడు మాత్రమే వ్యతిరేకించామని పేర్కొన్నారు. తమ పిల్లలు ఏ భాషలో చదవాలన్న విషయాన్నితల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేయాలని, ఇంగ్లీష్ మీడియం ఒక ఆప్షనల్‌గా మాత్రమే ఉండాలన్నది జనసేన పార్టీ అభిప్రాయమన్నారు.