గోవుల మధ్య గోపాలుడు : ఆవుల మధ్య ఉల్లాసంగా గడిపిన పవన్

మంగళవారం, 29 అక్టోబరు 2019 (20:16 IST)
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆబాల గోపాలుడుగా మారిపోయాడు. తన ఫామ్‌హౌస్‌లో ఉన్న గోవుల మధ్య ఆయన ఉల్లాసంగా గడిపాడు. అంతేకాకుండా, ఆవులకు అరటిపండ్లను స్వయంగా తినిపించారు. ఆయన చేతుల్లో ఉండే అరటి పండ్లను అందుకునేందుకు ఆవులో పోటీపడ్డాయి. 
 
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్‌కు వ్యవసాయక్షేత్రం ఉన్న విషయం తెల్సిందే. ఈ వ్యవసాయ క్షేత్రంలో మామిడి, ఇతర ఫల వృక్షాలు ఎన్నో దర్శనమిస్తాయి. అనేక రకాల కూరగాయలు కూడా పండిస్తారు. అంతేకాదు, పెద్ద సంఖ్యలో గోవులను కూడా పవన్ పెంచుతున్నారు.
 
ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఒక గోశాలను కూడా నిర్మించారు. ఈ క్రమంలో గోశాలను సందర్శించిన సందర్భంగా గోవులతో ఉల్లాసంగా గడిపారు. వాటికి అరటి పండ్లు తినిపిస్తూ మురిసిపోయారు. కొన్ని ఆవులు అరటిపండ్లు అందుకునేందుకు ఎంత తొందరపడుతున్నాయో అంటూ ట్విట్టర్‌లో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు