సీఎంగా నేను ఉండివుంటేనా... టీడీపీలో బాబు ఒక్కరే మిగిలివుండేవారు... పెద్దిరెడ్డి

మంగళవారం, 9 మార్చి 2021 (20:03 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి టీడీపీలో కనీసం కొంతమంది ఎమ్మెల్యేలైనా ఉన్నారని... తాను సీఎం అయ్యుంటే టీడీపీలో కేవలం చంద్రబాబు మాత్రమే మిగిలేవారన్నారు. 
 
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేయాలని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాజీనామాలు చేసినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? అని ప్రశ్నించారు. 
 
పంచాయతీ ఎన్నికల్లో ఓడిన బాధతో చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం 90 శాతం వైసీపీ విజయం సాధిస్తుందని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లను ఢిల్లీకి తీసుకెళ్తామని జగన్ చెప్పారని గుర్తుచేశారు. 
 
గతంలో ఏ సమస్యపైన అయినా, ఒక్కసారైనా చంద్రబాబు అఖిలపక్షం పెట్టారా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్‌కు అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని ఇనుప గనులను కేటాయిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఆ గనులను కేటాయించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. గ్రామ సచివాలయాల్లోని ఖాళీలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు.
 
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ‌కు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఉపయోగం ఏమిటని తెలుగుదేశం నేతలను ఆయన ప్రశ్నించారు. కేంద్రంపై అంతా విశాఖ స్టీల్ కోసం కలిసి పోరాడి సాధించాలని కోరారు. రాజీనామా చేయాలని టీడీపీ చేస్తున్న వ్యాఖలు అర్ధరహితమన్నారు. 
 
మళ్లీ ఎన్నికలు వస్తే వైసీపీ 170 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉక్రోషంతో మాట్లాడుతున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 90 శాతం విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. 
 
టీడీపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లను ఢిల్లీ తీసుకెళ్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారన్నారు. చంద్రబాబు హయాంలో ఏ సమస్య పైన అయినా ఒక్కసారైనా అఖిలపక్షం పెట్టారా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు