ప్రచారం సందర్భంగా తాను హారతి పళ్లెం పట్టుకుని నడుస్తున్నానని తెలిపింది. అయితే, ప్రచారంలో భాగంగా చల్లిన పువ్వులు హారతి పళ్లెంపై పడి మంటలు చెలరేగాయని, దాంతో అశోక్ గజపతిరాజు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేశారని ఆ మహిళ వెల్లడించింది. అశోక్ గజపతిరాజు సకాలంలో స్పందించకపోయుంటే తన చీరకు మంటలు అంటుకునేవని తెలిపింది.
అంతకుముందు.. విజయనగరంలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటనలో ఆయన ఓ మహిళపై చేయిచేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది.
అశోక్ గజపతిరాజు రామతీర్థం ఆలయానికి గౌరవ చైర్మన్‌గా ఉన్నారని, ఇప్పుడాయన తన అసలు రంగు బయటపెడుతున్నాడని సంచయిత వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ ఘటన తాలూకు వీడియోను కూడా సంచయిత పంచుకున్నారు.