కోవిడ్-19 నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలు, పెట్రోలు బంకులు, షాపింగ్ మాల్స్, మెడికల్ షాపులు ఇలా అన్నింటిల్లోకి కచ్చితంగా మాస్క్ ధరించే వారినే అనుమతించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి.వినరుచంద్ ఆదేశించారు.
ఆయన మాట్లాడుతూ దసరా, దీపావళి పండగల సమయంలో గుంపులుగా లేకుండా, భౌతిక దూరం పాటించేలా చూసుకోవాలన్నారు. కోవిడ్ నివారణపై ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్‌లను తమ సొంత ఖర్చులతో ఆయా సంస్థలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో హోర్డింగ్‌లన్నీ 10 రోజులు పాటు కోవిడ్ నివారణ ప్రచారానికే వినియోగించాలని సూచించారు. ఆర్‌టిసి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, హాస్పిటళ్లలో బ్యానర్లు, పోస్టర్లు డిసిప్లే చేయాలని కోరారు.
దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు కోవిడ్-19 ఎప్రాప్రియేట్ బిహేవియర్ పై పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.