పిన్నెల్లికి జూన్ 6వ తేదీతో ముగియనున్న గడువు!! ఇంటి వద్ద పోలీసుల పహారా (Video)

వరుణ్

గురువారం, 6 జూన్ 2024 (09:37 IST)
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత  పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా ఏపీ హైకోర్టు కల్పించిన మధ్యంతర ఉత్తర్వుల గడువు గురువారం రాత్రితో ముగియనుంది. మే నెల 13వ తేదీన జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలోకి పిన్నెల్లి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన వషయం తెల్సిందే. అలాగే, మాచర్లలో జరిగిన పలు దాడుల కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. 
 
అయితే, ఈ నెల ఆరో తేదీ వరకు ఆయనను అరెస్టు చేయొద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇపుడు ఈ గడువు తీరిపోనుంది. మరోవైపు, బందోబస్తుతో వైకాపా నేతను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయానికి తీసుకొచ్చిన పోలీసులు రిజిస్టర్‌లో సంతకం చేయించారు. నరసరావుపేట పట్టణ శివారు రావిపాడు రెవెన్యూ పరిధిలో ఆయన బస చేసిన ప్రైవేటు విల్లా (గృహం) వద్ద భద్రత మరింతగా పెంచారు. తప్పించుకుని వెళ్లిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పహారా కాస్తున్న పోలీసు సిబ్బందికి సూచించారు. శుక్రవారం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 

 

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై పోలీసులు నిఘా పెట్టారు.

ఎస్పీ ఆదేశాలతో ఆయన ఇంటి చుట్టూ మఫ్టీలో పహారా కాస్తున్నారు.

కోర్టు ఆదేశాల ప్రకారం పిన్నెల్లిని రేపు అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం

ప్రస్తుతం పిన్నెల్లి NRP లోని అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉన్నారు. pic.twitter.com/LSAl6PJLnS

— ???? (@TEAM_CBN1) June 5, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు