ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. స్వర్గీయ ఎన్టీరామారావుకు రెండుసార్లు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబా తమను విమర్శించేంది అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. కానీ, చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని కాపాడుకునేందుకు అదే కాంగ్రెస్ వద్ద మోకరిల్లారని ఆరోపించారు.
ఆదివారం అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు, నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, చంద్రబాబు తన కుమారుడు భవిష్యత్ కోసం ఆరాటపడుతున్నారన్నారు.
ఆయన విధానాలు, అవినీతితో రాష్ట్రం అస్తమిస్తుందన్న విషయాన్ని ఆయన గ్రహించడం లేదన్నారు. సన్‌రైన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేస్ అనే నినాదంతో చంద్రబాబు ముందుకు పోతున్నారనీ, కానీ, సన్‌రైజ్ స్టేట్ అంటే సన్‌రైజ్ (సీఎం పుత్రుడు బాగు) మాత్రమే లాభపడటం కాదన్నారు. అభివృద్ధి ఫలాలు ఆంధ్రులందరికీ అందినపుడే ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉంటారన్నారు.