వివరాల్లోకి వెళితే.. జూపూడి గ్రామానికిచెందిన తాడిశెట్టి కృష్ణ(45)కు అదే గ్రామానికి గండికోట నరసింహారావు, శ్రీనివాసరావు, తాడిశెట్టి హరిబాబు తదితరులతో పాత గొడవలు ఉన్నాయి. గత పది రోజుల నుంచి వీరి కుటుంబాలకు చెందిన సభ్యుల మధ్య స్వల్ప వివాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో సోమవారం తాడిశెట్టి పొలం పనులకు వెళ్లే నిమిత్తం స్వగృహంలో భోజనం చేస్తుండగా గండికోట నరసింహారావు, శ్రీనివాసరావు, మరి కొందరు కృష్ణ ఇంటిపై దాడిచేశారు. కృష్ణను కర్రలు, రాడ్లు, బరిసెలతో కొట్టుకుంటూ ఇంటి వెనుకవైపునకు తీసుకువెళ్ళినట్లు మృతుడి బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి దాడిలో తీవ్రంగా గాయపడి రక్తస్రావమైన కృష్ణను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించే క్రమంలో పరిస్థితి విషమించి మృతిచెందినట్లు పోలీసులు చెప్పారు.