హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఫాంటసీ హారర్ థ్రిల్లర్ అగత్యా. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా బ్యానర్స్ పై ఇషారి కే గణేష్, అనీష్ అర్జున్ దేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.