సీఎం జగన్‌పై పవన్ విమర్శలు చేయడం మానుకోవాలి : పోసాని కృష్ణ మురళి

సోమవారం, 10 జులై 2023 (10:19 IST)
సీఎం జగన్‌పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అదేపనిగా ఆరోపణలు చేస్తుండడం మానుకోవాలని ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి హితవు పలికారు. జగన్ అవినీతికి పాల్పడ్డాడని పవన్ ఒక్క ఆధారమైనా చూపించగలరా అని పోసాని సవాల్ విసిరారు.
 
అసలు, పవన్‌కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందని తాను అనుకోవడంలేదని, సీఎం జగన్‌ను ఓడించడం పవన్ వల్ల అయ్యేపనేనా? అని ప్రశ్నించారు. మాట్లాడితే జగన్‌ను గద్దె దించుతా అంటున్నాడని, వాస్తవానికి పవన్‌కు అంత బలం లేదని పోసాని స్పష్టం చేశారు. 
 
పవన్ అంత శక్తిమంతుడే అయితే, గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే చిరంజీవిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేకపోయాడని నిలదీశారు. వయసు రీత్యా జగన్... పవన్ కంటే చిన్నవాడని, తనకంటే చిన్నవాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంతో పవన్ ఓర్వలేకపోతున్నాడని పోసాని విమర్శించారు. 
 
తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారంటున్న పవన్ కల్యాణే మొదట తిట్టడం ప్రారంభించారని స్పష్టంచేశారు. అంతేకాకుండా, పవన్ కాపులను కూడా మోసం చేస్తున్నాడని, కాపుల కోసం పదవులు త్యాగం, ముద్రగడ పద్మనాభంను తిట్టించడం పవన్‌కు తగదని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు