పవర్ స్టార్ పవన్ కల్యాణ్-ఆయన మూడో భార్య అన్నా లెజ్నోవా విడిపోతున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అన్నాతో పవన్ కల్యాణ్‌కు వివాహం జరిగి పదేళ్లైంది. పవన్-అన్నా ఇప్పటికే విడిపోయారని.. అన్నా పిల్లలతో పాటు రష్యాకు వెళ్లిపోయారని టాక్ వస్తోంది. ఈ ఆరోపణలపై పవన్, అన్నా ఇంకా స్పందించలేదు.
పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెజ్నోవా ఇంకా చట్టబద్ధంగా కాకపోయినా సామాజికంగా విడిపోయారని టాక్ వస్తోంది. పవన్‌తో తరచుగా కనిపించే అన్నా లెజ్నోవా, గత నెలలో జరిగిన వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి నిశ్చితార్థంలో కనిపించలేదు.
ఇకపోతే.. 2011లో తన తీన్ మార్ సినిమా చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ అన్నను కలిశారు. అన్నా ఆ సమయంలో రష్యన్ మోడల్, నటి. అప్పుడే ఈ జంట ప్రేమలో పడింది. సెప్టెంబర్ 30, 2013న పెళ్లి చేసుకున్నారు.
అన్నాకు అప్పటికే తన మొదటి వివాహం నుండి పోలేనా అంజనా పవనోవా అనే కుమార్తె ఉండగా, పవన్- అన్నా 2017లో మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కొడుకును స్వాగతించారు. పవన్ గతంలో నందిని, రేణు దేశాయ్‌లను వివాహం చేసుకున్నారు. నందినిని 1997లో వివాహం చేసుకున్న పవన్.. ఆమెకు 2008లో విడాకులు ఇచ్చారు.