విద్యుత్ సంస్థలను లాభాల బాట పట్టించామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూ. 70వేల కోట్ల అప్పుల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ఆదుకున్నామని పేర్కొన్నారు.
వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్ నాటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు. 7 వేలకుపైగా జూనియర్ లైన్‌మెన్ పోస్టులు భర్తీ చేశామని, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసమే మీటర్లు బిగిస్తున్నామని ఆయన వివరించారు.