ప్రణబ్ మ‌ర‌ణం దేశానికి తీర‌ని లోటు: జగన్‌ దిగ్భ్రాంతి

సోమవారం, 31 ఆగస్టు 2020 (19:03 IST)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రణబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంక్షోభాలను పరిణితితో పరిష్కరించిన తీరు ఆదర్శనీయం అని కొనియాడారు.

రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ప్రణబ్‌ దేశానికి ఎంతో సేవలు చేశారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు