అమరీందర్ సింగ్‌కు రాసిన లేఖలో... తన తదుపరి చర్యల గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. 'మీకు తెలిసినట్లుగా.. ప్రజా జీవితంలోని క్రియాశీల పాత్ర నుండి కొంత విరామం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ మేరకు మీ ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వర్తించలేను. అదేవిధంగా భవిష్యత్తులో చేపట్టే కార్యాచరణపై కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నా బాధ్యతల నుండి తప్పిస్తారని ఈ లేఖ రాస్తున్నాను' అని పేర్కొన్నారు.
అయితే ప్రశాంత్ కిశోర్ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం ఆయన చూపంతా 2024 సార్వత్రిక ఎన్నికలు, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం పైనే కేంద్రీకరించినుట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామాచేశారని తెలుస్తోంది.