రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈ నెల 18వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాలు పోటీ చేస్తున్నారు.
ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయానికే తొలి నుంచి తెదేపా కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ద్రౌపది ముర్ముకు ఓట్లు వేస్తారని తెలిపారు.