శ్రీవారి సేవలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.. సామాన్య భక్తులకు తిప్పలు

బుధవారం, 28 డిశెంబరు 2016 (14:14 IST)
కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకటేశ్వరస్వామిని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం దర్శించుకున్నారు. ఆలయం మహద్వారం వద్ద టిటిడి అధికారులు ప్రణబ్‌కు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 
 
అంతకుముందు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దేశ ప్రథమపౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి వేదపండితులు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సన ఏర్పాట్లు చేశారు. మండపంలో అమ్మవారి తీర్థప్రసాదాలను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ కూడా తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. 
 
రాష్ట్రపతి రాకతో రెండు గంటల ముందే స్వామివారి దర్శనాన్ని తితిదే అధికారులు నిలిపేశారు. దీంతో సామాన్యభక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళ్యాణోత్సవంతో పాటు విఐపి బ్రేక్‌, ఆన్‌లైన్‌ శీఘ్ర దర్శన టిక్కెట్లను పరిమిత సంఖ్యలోనే తితిదే జారీచేసింది. 

వెబ్దునియా పై చదవండి