జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణంలో మాగుంట లేఔట్ ఉంది. ఇక్కడ అంతా ధనవంతులు నివసించే ప్రాంతం. అయితే, ఇక్కడ స్పా ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కొనసాగుతూ వచ్చింది. ఈ గుట్టును పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారంతో గృహంపై దాడి చేసిన పోలీసులు ఐదుగురిని అరెక్టు చేశారు. పలువురు అమ్మాయిలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని వెంకటగిరి ప్రాంతానికి చెందిన బి.ధనంజయ రెడ్డి కొన్నేళ్ల క్రితం నెల్లూరు నగరానికి వచ్చి స్థిపపడ్డాడు. ఈయన మాగుంట లేఔట్‌లో నివాసం ఉంటూ ఆర్థిక వ్యాపారాలు కొనసాగిస్తున్నాడు. అయితే, ఆర్నెల్ల క్రితం అతను అదే ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ఉన్న స్టూడియో 11 సెలూన్ అండ్ స్పాను నెలకు రూ.70 వేలు చెల్లించేలా లీజ్‌కు తీసుకున్నాడు.
ఈ స్పాను అధునాతన హంగులతో తీర్చిదిద్దాడు. వివిధ ప్రాంతాల్లో నుంచి యువతులను తీసుకువచ్చి వారిచే కస్టమర్లకు మసాజ్ చేయించడం ఆపై వారిచే వ్యభిచారం చేయించడం పరిపాటిగా మారింది. దీంతో పెద్దసంఖ్యలో కస్టమర్లు రావడం మొదలైంది. లావాదేవీలు మొత్తం ఫోన్‌లోనే హైటెక్ స్థాయిలో నిర్వహిస్తూ వచ్చాడు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకి పోలీసుల చెవికి చేరింది.
ఆ సమయంలో ఇద్దరు సెక్స్ వర్కర్లతో పాటు.. ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, పలు అశ్లీల చిత్రాలు, ఫోటోలు, విటుల ఫోన్ నంబర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.