అమీర్‌పేటలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. లాడ్జిలోని ఓ గదిలో?

బుధవారం, 21 ఆగస్టు 2019 (10:27 IST)
అమీర్‌పేటలో వ్యభిచార ముఠా గుట్టురట్టయ్యింది. హైదరాబాద్, అమీర్ పేటలోని ధరమ్‌కరమ్ రోడ్డులోని వున్న లాడ్జిలో వ్యభిచార ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పక్కా సమాచారం ప్రకారం లాడ్జిపై పోలీసులు దాడి చేశారు. 
 
ధరమ్‌కరమ్ రోడ్‌లోని ఓయో టౌన్ విల్లా లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రి వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అకస్మిక తనిఖీలు చేపట్టారు. 
 
ఆ సమయంలో లాడ్జిలోని ఓ గదిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. దీని నిర్వాహకుడైన నాని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హోటల్ మేనేజర్‌తో పాటు ఇద్దరు యువతులను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు