రాధా కృష్ణ పెయింటింగ్ ... విజ‌య‌వాడ‌ కళాకారిణి ప్ర‌తిభ‌

గురువారం, 26 ఆగస్టు 2021 (13:06 IST)
విజ‌య‌వాడ‌కు చెందిన క‌ళాకారిణి మేడా ర‌జ‌ని జాతీయ స్థాయిలో ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించారు. తూర్పుగోదావ‌రి జిల్లా కాట్రేనికోనకి చెందిన క్రియేటీవ్ హార్ట్స్ - ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంస్థ శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని భారతదేశ వ్యాప్తంగా ఆన్లైన్లో నిర్వహించిన చిత్రకళా పోటీలలో విజ‌య‌వాడ మ‌హిళ విజ‌యం సాధించారు.

23 రాష్ట్రాలకు చెందిన 215 మంది చిత్రకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అంజి ఆకొండి ఈ పోటీల‌ను నిర్వ‌హించారు. అత్యున్నత ప్రతిభను ప్రదర్శించిన వారి వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృశ్య కళ అకాడమి చైర్మన్ కుడిపూడి సత్య శైలజ భారత్ ప్రకటించారు. 
 
దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీలలో విజయవాడ నగరానికి చెందిన నలందా విద్యానికేతన్ స్కూల్ లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్  టీచర్ గా పనిచేస్తున్న శ్రీమతి మేడా రజనికి అత్యుత్తమ పురస్కారం "గోల్డెన్ బ్రష్ అవార్డు" దక్కింది. దేశవ్యాప్తంగా ప్రకటించిన 26 మంది  కళాకారుల జాబితాలో మన నగరానికి చెందిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ మేడా రజని ఉండటం గర్వకారణం.

తను పది రోజుల పాటు రాత్రింబవ‌ళ్ళు కష్టపడి చేసిన రాధాకృష్ణ పెయింటింగ్ విత్ పేపర్ క్విల్లింగ్ వర్క్ కి ఈ అవార్డు దక్కిందన్నారు. లలిత కళలు మానసికోల్లాసానికి దోహదపడటంతో పాటు మన కాళ్ళ మీద మనం నిలబడగలగటానికి ఎంతో తోడ్పడతాయని మేడా రజని చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు