టాలీవుడ్ హీరో ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. పూజా హెగ్డే కథానాయిక. యూవీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వంశీ, ప్రమోద్, ప్రశీదలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమికులరోజు(వేలంటైన్స్ డే) సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.
యూరప్‌లో ట్రైన్ ఆగడం అక్కడ ప్రభాస్ ఓ విదేశీ భాషలో తన ప్రేమను వ్యక్త పరుస్తూ డైలాగ్ చెప్పడంతో ప్రారంభమైన గ్లింప్స్. "నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా.." అని పూజా హెగ్డే అంటే... 'ఛ.. వాడు ప్రేమకోసం చచ్చాడు, నేను ఆ టైప్ కాదు..' అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ప్రభాస్ తన ప్రేమను వ్యక్తం చేసే గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ టీజర్ రిలీజైన కేవలం 34 నిమిషాల్లోనే 3,67,874 వ్యూస్ వచ్చాయి. 121 వేల మంది లైక్ చేయగా, 650 మంది డిజ్‌లైక్ చేశారు. కాగా, తెలుగు, హిందీ సహా కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూలై 30వ తేదీన విడుదల కానుంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్‌స్టోరి. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చుతున్నారు.