పండుగ సీజన్‌లో ప్రయాణికుల నుంచి డబ్బు దోచుకోవాలని దక్షిణమధ్య రైల్వే భావించింది. కానీ, తామేం తక్కువ తినలేదని నిరూపించిన ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వేకే తేరుకోలేని షాకిచ్చారు. ప్రయాణికుల తెలివితేటలకు రైల్వే ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. అసలు ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం.
పాసింజర్ ట్రైన్ మినిమమ్ చార్జి రూ.10 కాగా, పది రూపాయలు పెట్టి పాసింజర్ టికెట్ కొని దర్జాగా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌పై అడుగుపెడుతున్నారు. ఈ విధంగా రూ.20 ఆదా చేస్తున్నారు. అంతేకాదు, స్టేషన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు తమ వద్ద ఉన్న పాసింజర్ టికెట్‌ను ఇతరులకు ఇచ్చేస్తున్నారు.